- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. రేపు ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సమావేశం కానున్నారు. అనంతరం ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది.
12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు జరగనున్న చైర్ పర్సన్ ల ఎన్నిక జరగనుంది.
Also Read:హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- Advertisement -

