స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

5
- Advertisement -

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది ఈసీ. అక్టోబర్ 17 నుండి నామినేషన్లు స్వీకరించనుండగా 31 ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లకు సంబంధించి నిన్న సాయంత్రమే గెజిట్లు విడుదల జరిగింది అని ఎస్‌ఈసీ రాణికుముదిని తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగింది.. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.

5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని.. 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాం అని..అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు.

మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు…అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్..అక్టోబర్‌ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌..అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -