స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..

8
- Advertisement -

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వారిగా నోటిఫికేషన్ విడుదలైంది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

తొలి విడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా నేటి నుంచి ఎల్లుండి వరకు తొలి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుండగా నవంబర్ 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

Also Read:TTD:భక్తులకు టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు

- Advertisement -