మద్యం దరఖాస్తులు..రేపే చివరి రోజు

7
- Advertisement -

రాష్ట్రంలో లిక్కర్ షాపుల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఇప్పటి వరకు 50 వేల మద్యం దరఖాస్తులే వచ్చాయి. గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి దారుణంగా పడిపోయింది డిమాండ్.

2,620 వైన్సులకు నిన్న ఒక్కరోజే 25 వేల దరఖాస్తులువచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మద్యం షాపులకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం లాంటి కారణాలు ఉన్నా కూడా వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడి పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లిక్కర్ షాపులకు టెండర్ వేయాలని అధికారులు ఫోన్లకు మెసేజ్‌లు చేస్తుండటం విశేషం.

Also Read:గ్రీన్ ఇండియా ఛాలెంజ్..విప్లవాత్మక అడుగు

- Advertisement -