గ్రీన్ ఛాలెంజ్… మొక్కలు నాటిన జర్నలిస్ట్ లు

405
Journalist Green Challeange
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి విసిరిన ఛాలెంజ్ కు స్పందించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ‘ తెలంగాణా కలం- హరితహారం ” నినాదంతో జర్నలిస్టుల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు స్పందించి, రాష్ట్రంలోని చిన్న మధ్యతరహా పత్రికల కార్యాలయాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పుట్టిన రోజు సందర్బంగా ,బాలానగర్ లోని శుబ్ లాబ్ ,ధ్వని మరియు సిటిజన్స్ ఈవెనింగ్ కార్యాలయ ప్రాంగణం లో ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ గోపాల్ అగర్వాల్ , కార్యనిర్వాహక సంపాదకులు మయూరి అగర్వాల్ గారి పర్యవేక్షణలో మొక్కలు నాటడం జరిగింది .

ఈ సందర్భంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల అమానుష హత్యాచారానికి బలైన దళిత వివాహిత సమాత పేరుతొ ఒక మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUWJ రాష్ట్ర కోశాధికారి మారుతి సాగర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించిన అల్లం నారాయణ పుట్టినరోజు సందర్భంగా శుబ్ లాబ్ ,ధ్వని మరియు సిటిజన్స్ ఈవెనింగ్ కార్యాలయంలో మొక్కలు నాటడం చాల ఆనందదాయకం అన్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ నాయకులు అమన్ , వై . అశోక్ ,సిరికొండ అగస్టీన్ మరియు వేంకటయ్య పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -