తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్..

7
- Advertisement -

తెలంగాణ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క . అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..ఏ నోటిఫికేషన్ ఏ రోజున విడుదల అవుతుందనే వివరాలు జాబ్ క్యాలెండర్ లో ఉంటాయన్న భట్టి..పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదల సమయంలో ప్రకటిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని 32వేల మంది యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అదనంగా 13,500ఖాళీల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ నిర్వహించామన్నారు. జులై 18నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఆగస్టు 5న ముగియనున్నట్లు చెప్పారు.

పరీక్షల మధ్య ప్రిపరేషన్ కోసం తగినంత సమయం లేదని.. పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థనకు అనుకూలంగా  గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ కు వాయిదా వేసినట్లు గుర్తు చేశారు. 35సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం MNJక్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

Also Read:VD12..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -