తెలంగాణ జాగృతి సమావేశం.. తీర్మానాలు

3
- Advertisement -

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరించాలి.. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -1 పూర్తి స్థాయిలో వినియోగం లోకి తేవాలి అని జాగృతి తీర్మానించింది. ఇరిగేషన్ అడ్వైజర్ పోస్ట్ నుంచి ఆడిత్యనాథ్ దాస్ ను తొలగించాలని డిమాండ్ చేసింది.

ఏపీ అక్రమంగా నిర్మిస్తోన్న పోలవరం – బనకచర్ల (గోదావరి – కృష్ణా – పెన్నా లింక్) ప్రాజెక్టు పై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని తెలిపింది.

కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ కు బేసిన్, క్యాచ్ మెంట్, కమాండ్ ఏరియా, డ్రాట్ పోన్ ఏరియా ప్రాతిపదికన 575 టీఎంసీల నికర జలాలు సాధించేలా సమర్థ వాదనలు వినిపించాలి.. ట్రిబ్యునల్ పై అల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలి.

పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకు బదులుగా నాగార్జున సాగర్ కు ఎగువన 80 టీఎంసీల కృష్ణా నికర జలాల వినియోగానికి బచావత్ ట్రిబ్యునల్ పరమైన రక్షణలు ఉన్నాయి.. ఇందులో తెలంగాణ కు 45 టీఎంసీలు దక్కుతాయి. ఇప్పుడు పోలవరం నుంచి 200 టీఎంసీలను మల్లించాలని ఏపీ కొత్త ప్రాజెక్టు చేపట్టింది కాబట్టి మిగిలిన 120 టీఎంసీల్లోనూ తెలంగాణ కు 80 టీఎంసీల నికర జలాలు కేటాయించేలా .. మొత్తం 125 టీఎంసీల సాధనకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలి.

గోదావరి – మూసీ ప్రాజెక్టును మల్లన్న సాగర్ నుంచి కాకుండా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కొండపోచమ్మ సాగర్ నుంచి చేపట్టాలి.

ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలి.

Also Read:జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌..మరోసారి కామెంట్!

నాగార్జున సాగర్ ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి తేవాలి

జూరాల ప్రాజెక్టు కు వచ్చే వరదను సమర్థవంతంగా వినిగించుకునేలా మరో ఎత్తిపోతల పధకం చేపట్టాలి.

వార్థ బ్యారేజీ పనులు సత్వరమే చేపట్టి మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలకు 2 లక్షల ఎకరాలకు నీలివ్వాలి.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ఆపేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి

పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి వాటికి నికర జలాలు సాధించేందుకు ట్రిబ్యునల్ దగ్గర సమర్థవంతమైన వాదనలు వినిపించాలి.

సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టుతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలి.

- Advertisement -