- Advertisement -
తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ. విరుల సౌరభంతో పుడమి తల్లి పులకించే ఈ వేడుక …ప్రకృతి పూల పరిమళంతో వికసిస్తుంది. తంగేడు పరిమళం,గునుగులోని సోగసు,కట్లపూల సోయగం ఇలా 9 రోజుల పాటు మినీ కుంభమేళలా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతాయి. ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్షురాలు కవిత తెలిపారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పోస్టర్‌ని ఆవిష్కరించారు కవిత. జిల్లా కేంద్రాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కవిత తెలిపారు.
- Advertisement -