దేశంలోనే నెం1గా తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్ధః TSMDC చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి

594
Sheri Shubash Reddy
- Advertisement -

దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఖనిజాభివృద్ది సంస్ధ ఆదర్శంగా నిలిచిందన్ననారు TSMDC చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి. తెలంగాణలో ఇసుక ద్వారా 26వందల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. మెదక్ పట్టణంలో ఇసుకు డిపో ప్రారంభోత్సవానికి శేరి సుభాష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవెందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 10 కోట్లు రెవిన్యూ వస్తే… టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో 2,600 కోట్లు ఆదాయం సమకూర్చామని తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక ఇబ్బంది ఉండదన్నారు. వర్షాకాలం రాగానే… విపరీతంగా ఇసుక ధర పెరుగుతుందని చెప్పారు.

దీంతో ఇసుక వినియోగదారులు పెద్ద మొత్తంలో మూడింతలు ధర పలుకుతుందని… అలా కాకుండా 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ చేసినట్లు ఆయన తెలిపారు.ఆన్లైన్లో ఇసుకను కొనుగోలు చేయాలని అని తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖనిజాభివృద్ధి సంస్థ గత సంవత్సరం కన్నా 30 శాతం అదనంగా ఇసుక ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం… నది ఇసుక తగ్గించి, రాంబో స్టాండ్ రాతి పౌడరు వాడాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -