అభివృద్ధిలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.సూర్యాపేటలో వందకోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులతో పాటు సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయ భవనాలను ప్రారంభించారు.
తెలంగాణ ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా ఉందన్నారు. మరింత అభివృద్ధి జరుగుతుందని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఇందుకు ఉద్యోగులను అభినందించారు.సూర్యాపేటను జిల్లా చేయడం చరిత్ర అని అభిప్రాయపడ్డారు.సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తలసరి ఆదాయంలో మనం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని సీఎం తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి సూచీలో కూడా మనం నెంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు.
సూర్యాపేట పర్యటనలో భాగంగా రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read:జగ్గారెడ్డిపై కాంగ్రెసే అలా చేస్తోందా ?