డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని 138 దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును సీవీ ఆనంద్ అందుకున్న నేపథ్యంలో అభినందించారు సీఎం.
దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో అవార్డు అందుకున్నారు సీవీ ఆనంద్ . 138 దేశాలతో పోటీ పడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడంపై సీపీని అభినందించారు సీఎం రేవంత్.
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికి ప్రభుత్వమే బలంగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు, డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read:అవకాడోతో అద్భుత ప్రయోజనాలు

