రాష్ట్రాభివృద్ది కోసమే అప్పులు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పై సుదీర్ఘ ప్రసంగం చేసిన సీఎం రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించటంలేదని, కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో అప్పులు 40 శాతం ఉన్నాయని, అదేక్రమంలో రాష్ట్ర అప్పులు 21 శాతం ఉన్నాయని వెల్లడించారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధును బీజేపీ మంత్రులే వచ్చి మెచ్చుకుంటున్నారు. రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఒడిషా సీఎం నా సమక్షంలోనే ప్రకటించారని గుర్తు చేశారు.
54 లక్షల ఇళ్లకు నిత్యం భగీరథ మంచినీళ్లు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నామని చెప్పారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రజలు ఏ నీళ్లు తాగుతున్నారో ఆదిలాబాద్ గోండుగూడెం ప్రజలు కూడా అవే నీళ్లు తాగుతున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్ తెలంగాణ వ్యతిరేకి. అయినా వైఎస్ పెట్టిన ఆరోగ్యశ్రీని కొనసాగిస్తామని చెప్పినామని చెప్పారు. రైతులను రుణ విముక్తులను చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.