తెలంగాణ ఇంటర్‌మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత 57 శాతం, కాగా ద్వితీయ సంవత్సరంలో 66.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 1 నుంచి 17 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగిన విషయం విదితమే. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలను 4.75 లక్షల మంది, రెండో సంవత్సరం పరీక్షలను ఐదు లక్షల మంది విద్యార్థులు రాసినట్లు అధికారులు తెలిపారు.
http://www.results.manabadi.co.in/2017/telangana/Inter-2nd/ts-intermediate-2nd-year-regular-exam-results-2017.htm
www.tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in
www.manabadi.com, www.vidyavision.com
www.manabadi.co.in, www.results.cgg.gov.in