ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి అని తెలిపారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఇంటర్ మొదటి రెండవ సంవత్సరాలకు కలిపి 9 లక్షల 97 వేల 12 మంది హాజరయ్యారు..మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 66.89 శాతంగా ఉందని తెలిపారు.
సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37 శాతంగా ఉండగా మొదటి సంవత్సరం బాలికలు పాస్ పర్సంటేజ్ 73.83శాతంగా ఉందని చెప్పారు. బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.83 శాతంగా ఉండగా సెకండ్ ఇయర్…బాలికలు పాస్ పర్సంటేజ్ 74.21 శాతంగా, సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.21 శాతంగా ఉంది.
ఇంటర్ సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా 81.06 శాతంతో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో 80.24 శాతంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్, 77.91 శాతంతో మేడ్చల్ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం 77.21 శాతంతో మేడ్చల్, రెండవ స్థానంలో 76.36 శాతంతో రంగారెడ్డి, మూడవ స్థానంలో 70.52 శాతంతో కొమరం బీమ్ ఆసిఫాబాద్ ఉన్నాయని తెలిపారు.
Also Read:గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ సమావేశం..

