తెలంగాణ ఇంటర్ ఫ‌స్టియ‌ర్ పరీక్షల టైం టేబుల్ ఇదే..

64

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేప‌థ్యంలో తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప‌మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 29,30న జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 31, న‌వంబ‌ర్ 1వ తేదీకి మార్చింది ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు. ఈ పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

2020-21 విద్యాసంవ‌త్స‌రానికి చెందిన ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు (ప్ర‌మోటై ప్ర‌స్తుతం సెకండియ‌ర్‌లో ఉన్న విద్యార్థులు) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 70 శాతం సిల‌బ‌స్ నుంచే ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామ‌న్నారు. ప్ర‌తి ఎగ్జామ్ సెంట‌ర్‌లో ఒక‌ట్రెండు ఐసోలేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ న‌ర్సు అందుబాటులో ఉండ‌నున్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైం టేబుల్..

అక్టోబ‌ర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ, 31న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, న‌వంబ‌ర్ 1న‌ కెమిస్ట్రీ, కామ‌ర్స్, 2న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, 3న మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ పేప‌ర్ల‌కు ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు.