పంటల రుణ పరిమితి పెంపు

369
farmer
- Advertisement -

ఆర్గానిక్‌ పంటలకు ప్రోత్సాహాం అందించడంలో భాగంగా పంటల రుణ పరిమితి పెరిగింది. రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీవరి, కంది, శనగ, పెసర, మినుము, ఆయిల్‌పాం, టమాట, వంకాయ మొదలైన పంటలకు రుణ పరిమితిని పెంచారు.

దాదాపు 120 రకాల పంటలకు 2020-21 ఆర్థిక ఏడాదిలో ఎంతెంత రుణం ఇవ్వాలన్నదానిపై తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) భారీ కసరత్తు చేసి సంబంధించిన నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ)కి పంపించింది.

ఈ నివేదిక ప్రకారం వరి విత్తనోత్పత్తికి రుణపరిమితిని ఎకరాకు రూ.42 వేల నుంచి రూ.45 వేల మధ్య, శ్రీవరికి రూ.36 వేలకు పెంచుతూ టెస్కాబ్‌ నిర్ణయం తీసుకున్నది. ఈసారి కొత్తగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఎకరానికి రూ.4.25 లక్షల రుణపరిమితి ఖరారుచేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కొన్ని పంటలకు మాత్రమే రుణ పరిమితి పెరిగింది.

సేంద్రియ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేల మధ్య, సాగునీటి వసతి ఉన్న టమాట ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్య ఇవ్వాలని నిర్ణయించారు.

- Advertisement -