తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ధాన్యం ఉత్పత్తి పెరిగిందన మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రమే ధాన్యం కొనలేమని చేతులెత్తేసిందని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం సంప్రాదాయ పంటల నుంచి ప్రత్యామ్నయ పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్ ఆయిల్ ఆయిల్ సీడ్ రంగంలో గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి కేటీఆర్, నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆయిల్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో నగరం పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభతరం చేశామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అమెజాన్ క్యాంపస్ ఏర్పాటుకు 11 రోజుల్లోనే అన్నిరకాల పర్మిషన్లు ఇచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో గ్రీన్ కవర్ 24 శాతం పెరిగిందన్నారు.
Minister @KTRTRS delivering keynote address at @IVPA_India’s Global Roundtable on Veg Oil and Oilseed Sector, in Hyderabad. https://t.co/O7NDOBQeqK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 18, 2022
ఇవి కూడా చదవండి..