KTR:తెలంగాణ దేశానికే దిక్సూచి

12
- Advertisement -

దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని… దశాబ్దం గడిచిన సందర్భమిది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఆధునిక భారతం కళ్లరా చూసిన… మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం..బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన…కేసీఆర్ పోరాట ఫలితమిది అన్నారు.

అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై… ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది అన్నారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి… మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను…పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది అన్నారు.

పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే…మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది..తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా…అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం సాగిందన్నారు. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు… దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ అన్నారు.నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ…నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్నారు.

అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని… తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని…కాంక్షిస్తూ…ఆకాంక్షిస్తూ…ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సావ శుభాకాంక్షలు అన్నారు.

https://x.com/KTRBRS/status/1797088008933384611?t=Oge2l62ztcBGPorVzHic7g&s=08

- Advertisement -