- Advertisement -
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా వైద్యశాఖలో బదిలీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ శాంతకుమారి, వైద్యఆరోగ్య శాఖ కమిషనర్ యోగిత రాణాపై బదిలీ వేటు వేసింది.
వీరిస్ధానంలో స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ రిజ్వి, వైద్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. కరుణ గతంలో వైద్యశాఖ కమిషనర్‌గా పనిచేయడం విశేషం.
ఇక శాంతికుమారిని అటవీశాఖకు బదిలీచేయగా, యోగితా రాణాను సాంఘిక సంక్షేమానికి మార్చారు. వీరితో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి చిత్రారామచంద్రన్‌ను తప్పించి ఆ స్శానంలో దేవసేనకు పోస్టింగ్ ఇచ్చారు.
- Advertisement -