మద్యం దుకాణాలపై సర్కార్‌కు చీవాట్లు!

8
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తాము తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.

కనీసం రహదారిపైకి కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి సూచించారు. నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాల్సిందిగా మున్సిపల్, ఎక్సైజ్ అధికారులకు మరియు షాపు యజమానులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read:లోకల్ బాడీ ఎన్నికలు..మండలాల వారీగా వివరాలు

మద్యం పాలనపై ప్రభుత్వం తగిన విధానాన్ని అనుసరించాలని, నివాస ప్రాంతాలలో ఇటువంటి దుకాణాల ఏర్పాటు సామాజిక సమస్యలకు దారితీస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

- Advertisement -