ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే..

8
- Advertisement -

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వెంటనే కూల్చివేతలను ఆపాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానంలో నాగార్జునకు రిలీఫ్ లభించింది.

ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో నాగార్జున పిటిషన్ వేశారు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు కూల్చివేతలు చేపట్టారని వెంటనే వాటిని ఆపేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో నాగార్జున వాదనను పరిగణలోకి తీసకున్న న్యాయస్థానం కూల్చివేతలపై స్టే విధించింది.

Also Read:ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..హైకోర్టులో పిటిషన్

- Advertisement -