- Advertisement -
మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించారు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి.
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, వార్డు రిజర్వేషన్లు పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేశారు ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది.
Also Read:బొమ్మరిల్లు తర్వాత 3 బీహెచ్కే !
ఈ విషయంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరగా, రెండు వారాల సమయం అడిగారు ప్రభుత్వం తరపు న్యాయవాది. దీంతో తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.
- Advertisement -

