- Advertisement -
తెలంగాణ భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్‌లు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ముగ్గురు ఐపీఎస్‌లు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా. భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేశారు.
27 మందికి చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌ల పిటిషన్లపై విచారణ ముగించింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది హైకోర్టు.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అదే బెంచ్‌లో వెకేట్ పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అలాగే సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్దె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read:అజార్ పేరును తొలగించవద్దు:హైకోర్టు
- Advertisement -

