- Advertisement -
10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుండి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రతీ పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఇవ్వాలని సూచించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని తెలిపింది. పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయాలని వెల్లడించింది.
జూన్ 3న పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి జూన్ 4న పూర్తి వివరాలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని వెల్లడించింది. పరీక్షా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
- Advertisement -