మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

629
Telangana High Court
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని కోర్టు సూచించింది.

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం, నేడు తీర్పును ప్రకటించింది. కాగా, ఈ సంవత్సరం జనవరి 1 నాటికి నమోదైవున్న ఓటర్ల జాబితా ప్రకారమే మునిసిపోల్స్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది.

- Advertisement -