హైకోర్టు వద్ద న్యాయవాదుల సంబరాలు..

169
advocates
- Advertisement -

ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదుల సంబరాలు జరుపుకున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఎన్వీ రమణ.. తెలుగు జాతికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం పట్ల తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు, బార్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు న్యాయవాదులు.

- Advertisement -