వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ..

138
cm kcr
- Advertisement -

రాష్ట్ర వైద్యారోగ్య శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. భూ క‌బ్జాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల శాఖ‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్‌, రెవెన్యూఅధికారులు తేల్చారు.

ఈట‌ల రాజేంద‌ర్ భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై ఈరోజు ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌నుంది. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈట‌ల భూ క‌బ్జాల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక అందిస్తామ‌ని విజిలెన్స్ డీజీ పూర్ణ‌చంద‌ర్ రావు తెలిపారు. అచ్చంపేట్, మాసాయిపేట గ్రామాల‌కు చెందిన కొంత‌మంది రైతులు త‌మ అసైన్డ్ భూముల‌ను ఈట‌ల రాజేంద‌ర్ అక్ర‌మంగా లాక్కున్నార‌ని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.
రైతుల ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో అధికారులు.. ఈట‌ల హేచ‌రీస్ ప‌క్క‌న ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిట‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. మాసాయిపేట త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలించారు. అచ్చంపేట‌, మాసాయిపేట‌లో మెద‌క్ క‌లెక్ట‌ర్ హ‌రీష్ విచార‌ణ చేశారు. రైతుల నుంచి వివ‌రాల‌ను సేక‌రించారు. క్షేత్ర స్థాయిలో స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత నివేదిక ఇస్తామ‌ని క‌లెక్ట‌ర్ హ‌రీష్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -