తల్లీబిడ్డల క్షేమం కోసమే ఈ కిట్‌:హరీశ్‌

27
- Advertisement -

తెలంగాణలోకి ప్రతిబిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే కాంక్షతో సీఎం కేసీఆర్ పౌష్టికాహార కిట్‌నను అందిస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తల్లి స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకే పుట్టిన బిడ్డగా చేప్పవచ్చన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కామారెడ్డి జిల్లా కలేక్టరేట్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆరోగ్య వైద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ….పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ రూపొందించారని తెలిపారు. తల్లీ, బిడ్డ బాగుండాలని న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రొటీన్‌ డైట్‌ ఉంటుందన్నారు. ప్రతి కిట్‌ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తామన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలేచించే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.

పౌష్టికాహార కిట్‌తో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బాలికల కోసం 551 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ బృహత్తర ప్రణాళికతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రొటీన్స్‌ , మినరల్స్‌ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్‌ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యమన్నారు.

మొదటి కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ సమయంలో, రెండోకిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఇవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడనున్నది. తొలివిడుతలో 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు శ్రీకారం..

కమలం పార్టీ స్లో అయిందా?

నా బొచ్చు ఇస్తా.. ఏం జేస్తావో చెయ్!

- Advertisement -