ప్రజలు కోరిన చోట శిబిరాలు:హరీశ్‌

16
- Advertisement -

రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని వివేకానందా కమ్యూనిటీహాల్‌లో కంటివెలుగు శిబిరాన్ని మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలిచయన్నారు. మన పథకాలను అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయన్నారు. కంటివెలుగును పంజాబ్‌, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు.

వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకు టీమ్‌లను పంపిస్తామని తెలియ జేశారు.

ఇవి కూడా చదవండి..

లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ సొత్తు

ఖమ్మం జిల్లాకు వరాల్లు:సీఎం

రెండోవిడత కంటివెలుగు ప్రారంభం..

- Advertisement -