రాష్ట్రంలో ఒంటిపూట బడులు

12
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి.

ఇక పదో తరగతి పరీక్షా జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. ఇప్పటికే రంజాన్‌ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.

Also Read:TTD:శాస్త్రోక్తంగా మహా సంప్రోక్ష‌ణ

- Advertisement -