తెలంగాణ గురుకుల విద్యార్ధులు మరో ఘనత సాధించారు

105
gurukula
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల నుండి ఎవరెస్ట్ శిఖరం ఆధిరోహించిన విషయం తెలిసిందే.తాజాగా గురుకులాల నుండి నలుగురు విద్యార్థులు అన్ని రకాల ఉత్తీర్ణతలు సాధించారు. ఇక అమెరికాలో అడుగుపెట్టి.. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డ‌మే వారి ప‌ని. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఆ న‌లుగురు సిద్ధ‌మ‌య్యారు.

లావ‌ణ్య‌, హారిక‌, స్వ‌ప్నిక అనే అమ్మాయిలు నాలుగేళ్ల డిగ్రీ విద్య‌ను అయోవా స్టేట్ యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌నున్నారు. చైత‌న్య అనే అబ్బాయి మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అభ్య‌సించ‌నున్నారు. యూఎస్‌లోని యూనివ‌ర్సిటీల్లో గురుకుల విద్యార్థులు డిగ్రీ విద్య‌ను అభ్య‌సించ‌డం ఇదే తొలిసారి. ఇక గురుకులాల‌కు చెందిన ప‌లువురు విద్యార్థులు యూఎస్ యూనివ‌ర్సిటీల్లో ఇంట‌ర్న్‌షిప్, ఫెలోషిప్ ప్రోగామ్స్‌లో పాల్గొన్నారు.

- Advertisement -