తెలంగాణ గ్రూప్‌1 ప్రాథమిక కీ రిలీజ్‌

161
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొలిసారి టీఎస్పీఎస్సీ 503 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి ఈనెల 16న పరీక్షను నిర్వహించింది. 2,86,031 మంది పరీక్షకు హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రాథమిక కీని తాజాగా శనివారం విడుదల చేసింది. ప్రాథమిక కీ ని tspsc.gov.in వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రేపటి నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

ఈ మెయిల్‌, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. అభ్యంతరాల ఆధారాలను లింక్‌లో పీడీఎఫ్‌ ద్వారా జతపరచాలని సూచించింది. అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలుంటే గడువులోగా మాత్రమే చెప్పాలని, 4న 5 గంటల తర్వాత వచ్చే వాటిని పరిగణలోకి తీసుకోమని చెప్పింది. అభ్యర్థులు తేదీలను గమనించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే లింక్ ద్వారా సమర్పించాలని కోరింది.

వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్‌ డిజిటల్‌ ప్రతాలు అందుబాటులో ఉన్నాయని, ఓఎంఆర్‌ పత్రాలు వెబ్‌సైట్‌లో నవంబర్‌ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత అందుబాటులో ఉండవని చెప్పింది. పూర్తి వివరాల కోసం tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ప్రిలిమ్స్‌లో మెరిట్‌, రిజర్వేషన్‌ను బట్టి 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆ పీహెచ్‌డీ డిగ్రీలకు ఆనుమతి లేదు:యూజీసీ, ఏఐసీటీఈ

ఉక్కుమనిషి జయంతి రోజున ఐక్యతా నివాళి

సమంతకు అరుదైన వ్యాధి

- Advertisement -