మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ

19
- Advertisement -

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఇందులో 2,500 మంది ఉద్యోగులకు సరిపడే సదుపాయాలుంటాయి.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం మైక్రోసాఫ్ట్ కొత్త భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.

ADVANTA(I)GE TELANGANA ప్రోగ్రాం పేరిట మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI కోర్సును పరిచయం చేసేందుకు AI ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తోంది. దీంతో దాదాపు 50 వేల మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.

AI-ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రమంతటా 20,000 మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను నేర్పిస్తుంది. AI-గవర్న్ ఇనీషియేటివ్ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు AI, సైబర్ సెక్యూరిటీ కోసం వివరించనున్నారు.

Also Read:భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే: రేవంత్ రెడ్డి

- Advertisement -