- Advertisement -
తెలంగాణలో వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గతంలోనే తెలిపారు. ఈమేరకు వైద్య వ్యవస్థను మరింత విస్తరించేందుకు పలు ఉద్యోగులను భర్తీచేయనుంది. తాజాగా నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. డీఎంఈ డీహెచ్ పరిధిలో 3823 పోస్టులను మరియు వైద్య విధాన పరిషత్‌లో 757పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ఇవే..
- డీఎంఈ, డీహెచ్ – 3,823
- వైద్య విధాన పరిషత్ – 757
- బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197
- తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127
- సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124
- ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ – 81
- ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74
- తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ – 13
- డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8
ఇవి కూడా చదవండి….
- Advertisement -