టీచర్లు…మార్గదర్శాకాలు ఇవిగో

78
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల ఉత్తర్వుల జారీకి సంబంధించిన జీవో నెంబర్‌5ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో స్కూల్‌ అసిస్టెంట్లు ఎస్జీటీల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 28న నుంచి ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.

మార్చి 5 నుంచి 19వరకు అప్పీళ్లను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్‌ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్టు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఐదుళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాల్లో 50యేళ్లలోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి అక్కడ కొత్తగా మహిళా ఉపాధ్యాయురాలను నియమించనున్నారు.

ఒక వేళ మహిళా ఉపాధ్యాయురాలు లేకపోతే 50యేళ్లు దాటిన పురుషులను నియమిస్తామని జీవో వెల్లడించారు. ఈ మేరకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు డీఈవో ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

పవన్ నిప్పులు.. వైసీపీ చురకలు !

కరోనాపై పోరులో తొలి నాసల్‌ వ్యాక్సిన్‌

రిపబ్లిక్ డే ; రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా ?

- Advertisement -