మెడికోలకు గుడ్‌న్యూస్…

5
- Advertisement -

తెలంగాణ మెడికోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఒకేసారి 15% స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జూడాల సమ్మె నోటీస్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది ప్రభుత్వం. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌‌లో రూ.74,782 స్టైఫండ్ అందనుంది.

సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌‌లో రూ.1,11,785, థర్డ్‌ ఇయర్‌‌లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది.

Also Read:రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’

- Advertisement -