ఇకపై తెలంగాణలో 33 జిల్లాలు.. కొత్తగా చేరిన జిల్లాలు ఇవే..

231
Telangana
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో మొన్నటి వరకు 31 జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరింది. ఈ నెల 17 నుండి మరో రెండు కొత్త జిల్లాలు అందుబాటులోకి రావడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ్‌పేట, ములుగులను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నారాయణ్‌పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను గత ఆదివారం (17న) విడుదల చేసింది. దీంతో నిన్నటి నుండి నారాయణ్‌పేట, ములుగు కొత్త జిల్లాలుగా రూపుదిదుకున్నాయి.

KCR

ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా పరిధిలోకి రానుండగా.. నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూరు, ఉట్కూర్‌, నర్వ, మక్తల్‌, మాగనూరు, కృష్ణా మండలాలు నారాయణపేట పరిధిలోకి వచ్చాయి.

నిన్న(17) సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం నుంచి కొత్త జిల్లాలు అధికారికంగా ఏర్పాటు కావడం విశేషం. ఇక ఈ కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం జన్మదిన కానుకగా టీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -