ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు: కోమటిరెడ్డి

1
- Advertisement -

తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధాకరం..రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు. ఇకనుంచి బెనిఫిట్ షో లకి పర్మిషన్ ఇవ్వం అన్నారు.

హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా? చెప్పాలన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం..హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరం అన్నారు.

మనిషి ప్రాణం తీసుకురాగలరా..?, వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా.. బాధితులకు 25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ సినిమా హీరోకి ప్రొడ్యూసర్లకు చెప్తున్నా అన్నారు.

Also Read:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

- Advertisement -