- Advertisement -
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ గ్రూప్1 ఎస్‌ఐ కానిస్టేబుల్ శిశు మహిళ సంక్షేమ శాఖలోని పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్ -2 ఉద్యోగాలు 663, గ్రూప్-3 ఉద్యోగాలు 1,373, పశుసంవర్ధక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50 పోస్టులు, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- Advertisement -