గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ

340
Green Challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే మూడు కోట్లు మైలు రాయిని దాటిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించి మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను ఆయన ఇవాళ స్వీకరించారు.

రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్‌ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నానన్నారు. మూడు విభిన్న జాతులకు చెందిన మొక్కలను మెట్రోరైల్‌ భవన్‌ ఆవరణలో నాటానని ఆయన తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ గారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఆయన అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణంపై అవగాహన సృష్టిస్తుందని ఆయన అన్నారు.  గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు అధికారులను నామినేట్‌ చేశారు. వారిలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆధార్‌ సిన్హ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సెక్రటరీ మెంబర్‌ అనిల్‌ కుమార్‌ ఉన్నారు.

- Advertisement -