న్యూ ఇయర్..పోలీసులకు పథకాలు

3
- Advertisement -

న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సేవలను గౌరవిస్తూ పలు ప్రోత్సాహక పథకాలు, నగదు పురస్కారాలను ప్రకటించింది. ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బందిని ఉత్సాహపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి ప్రత్యేక పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ‘తెలంగాణ శౌర్య పథకం’ కింద ఎంపికైన సిబ్బందికి నెలకు రూ.500 పింఛన్‌తో పాటు ఒక్కసారిగా రూ.10 వేల నగదు పురస్కారం అందించనున్నారు. అత్యున్నత స్థాయి సేవలకు గాను ‘మహోన్నత సేవా పథకం’ కింద రూ.40 వేల నగదు పురస్కారం ఇవ్వనున్నారు.

అలాగే ఉత్తమ సేవలందించిన వారికి ‘ఉత్తమ సేవా పథకం’ కింద రూ.30 వేల నగదు బహుమతి ప్రకటించారు. కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన సిబ్బందికి ‘కటినా సేవా పథకం’ కింద రూ.20 వేల నగదు పురస్కారం అందించనున్నారు. అదేవిధంగా సాధారణంగా ఉత్తమ పనితీరును కనబరిచిన వారికి ‘తెలంగాణ సేవా పథకం’ కింద కూడా రూ.20 వేల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకాల ద్వారా పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్ సిబ్బందిలో మరింత ఉత్తేజం పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

- Advertisement -