ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

176
telangana governament is hike to DA government employes
- Advertisement -

తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది ప్ర‌భుత్వం. ఇక నిన్న జ‌రిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం నిన్న వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. నేడు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

telangana governament is hike to DA government employes

నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన 18 డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈనేపథ్యంలోనే డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.572 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. ఫించన్ దారులకు కూడా డీఏ వర్తించనుంది. పెరిగిన డీఏ జులై 1, 2017 నుంచి అమలులోకి రానుంది. దీంతో తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగులు సీఎం కేసీఆర పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -