టీన్యూస్ – అపెక్స్ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమం ముగిసింది. ఈ ఫెయిర్‌ను వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి సందర్శించారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్న టీన్యూస్ యజామాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమం విధ్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం స్టాళ్లు నిర్వహిస్తున్న కాలేజీలకు మెమెంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమం ద్వారా తాము ఎంచుకునే కాలేజీల వివరాలను తెలుసుకునేందుకు వీలు కలిగిందని తల్లితండ్రులు, విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్లో రెండోసారి తెలంగాణ గోల్డెన్ ఎడ్యూకేషన్ ఫెయిర్ నిర్వహించినందుకు టీన్యూస్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు. రెండు రోజులు పాటు జరిగిన ఈ ఫెయిర్‌లో ఎంతో మంది విధ్యార్థులు, తల్లితండ్రులు తమ సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. ఆదివారం కావడంతో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గోని.. వివిధ కాలేజీల సమాచారాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత విద్యార్ధులతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించేందుకు బాగా ఉపయోగపడిందంటున్నారు విధ్యార్థులు. టీన్యూస్ ఎడ్యూకేషన్ ఫెయిర్ అద్బుతంగా సాగిందని ఫెయిర్‌లో పాల్గోన్న కాలేజీ యజామాన్యాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఫెయిర్ కు హాజరైన వాళ్లలో నుంచి లక్కీ డిప్ ద్వారా ఎంపికైన విజేతకు ల్యాప్ టాప్ ను బహుమానంగా అందజేసింది టీన్యూస్ యాజమాన్యం. కాగా కార్యక్రమ నిర్వహణకు ప్లాటీనం స్పాన్సర్స్ మర్రి లక్ష్మణ్ గ్రూప్ ఇనిస్టిట్యూట్, డైమండ్ స్పాన్సర్స్ ఎస్‌వీఎస్ విద్యాసంస్థలు, గోల్డెన్‌స్పాన్సర్స్ శ్రేయ ఇంజినీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఈ ఫెయిర్‌లో రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా 40 పేరుగాంచిన విద్యాసంస్థలు పాల్గొన్నాయి. ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు ఇతర అన్ని కోర్సులు, కెరీర్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో టీ న్యూస్ సీజీఎం ఉపేందర్‌తో పాటుగా వివిధ కాలేజీల యాజమాన్యాలు పాల్గొన్నాయి.