జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. 2017 ఏడాదికిగానూ వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులను ఎంపిక చేస్తూ యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 52 మందికి ఈ పురస్కారాలు ప్రకటించారు. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116ల చొప్పున పారితోషకంతో పాటు శాలువా, జ్ఞాపికతో సీఎం చేతుల మీదుగా సత్కరించనున్నారు.
పురస్కార గ్రహీత పేరు – రంగం
* వెలపాటి రామరెడ్డి – సాహిత్యం
* ఆశరాజు – సాహిత్యం
* జూపాక సుభద్ర – సాహిత్యం
* అస్లాం ఫర్షోరి (ఉర్దూ) – సాహిత్యం
* రాఘవరాజ్ భట్ (మంగళభట్) – సాంప్రదాయ నృత్యం
* బి. సుధీర్ రావు – సాంప్రదాయ నృత్యం
* పేరిణి కుమార్ – పేరిణి
* దురిశెట్టి రామయ్య -జానపదం
* కేతావత్ సోమ్‌లాల్ -జానపదం
* గడ్డం సమ్మయ్య -జానపదం
* మాలిని రాజొల్కర్ -సంగీతం
* వారాసి బ్రదర్స్ – సంగీతం
* వందేమాతరం ఫౌండేషన్ – సామాజిక సేవ
* యాకుబ్ బీ – సామాజిక సేవ
* పీవీ శ్రీనివాస్ – జర్నలిజం
* ఎ. రమణకుమార్ – జర్నలిజం
* బిత్తిరి సత్తి – సావిత్రి (రవి, శివజ్యోతి) – జర్నలిజం
* వి. సతీష్ – జర్నలిజం
* ఎండీ మున్నీర్ – జర్నలిజం
* అనిల్‌కుమార్ – ఫొటో జర్నలిజం
* హెచ్.రమేశ్‌బాబు -సినిమా జర్నలిజం
* డాక్టర్ బీరప్ప (నిమ్స్)- వైద్యరంగం
* డాక్టర్ చారి (వెంకటాచారి) – వైద్యరంగం
* డాక్టర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి (వీణవంక జూనియర్ కాలేజీ) – ఉపాధ్యాయరంగం
* పులిరాజు (జడ్పీహెచ్‌ఎస్) – ఉపాధ్యారంగం
* ఎం.బిక్షపమ్మ – అంగన్వాడీ టీచర్
* కొడరి శ్రీను – ఉద్యమగానం
* ఒల్లల వాణి -ఉద్యమగానం
* అవునూరి కోమల – ఉద్యమగానం
* అభినయ శ్రీనివాస్ – ఉద్యమగానం
* తోట వైకుంఠం – చిత్రలేఖనం
* శ్రీనివాస్‌రెడ్డి – శిల్పరంగం
* డాక్టర్ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ – పరిశోధన
* మడిపల్లి దక్షిణామూర్తి – వ్యాఖ్యానం
* పురాణం నాగయ్యస్వామి – అర్చకుడు
* కక్కెర కిష్టయ్య, మేడారం – అర్చకుడు
* శాంతశ్రీ సంగ్రం మహరాజ్ – ఆధ్యాత్మికం
* ఉమాపతి పద్మనాభ శర్మ – ఆధ్యాత్మికం
* మొహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్-హదీష్ – ఆధ్యాత్మికం
* దెంచనాల శ్రీనివాస్ – రంగస్థలం
* వల్లంపట్ల నాగేశ్వరరావు – రంగస్థలం
* తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (హకీంపేట) – క్రీడలు
* యండల సౌందర్య (హాకీ) – క్రీడలు
* నరేంద్ర కార్పె – వేదపండిత్
* జె.రాజేశ్వరరావు – బెస్ట్ లాయర్
* ఉత్తమ మున్సిపాలిటీ – సిద్దిపేట
* శ్రీనివాస్‌నగర్ (మానకొండూరు) – ఉత్తమ గ్రామ పంచాయితీ
* నేతి మురళీధర్, ఎండీ, టెస్కాబ్ – ఉత్తమ ఉద్యోగి
* ఎన్. అంజిరెడ్డి (ఏఈఎస్) – ఉత్తమ ఉద్యోగి
* కండ్రె బాలాజీ (కెరమెరి) – ఉత్తమ రైతు
* గడ్డం నర్సయ్య – ఈల పాట (ప్రత్యేక తరగతి)