చిరుకు తెలంగాణ ఫిలీం ఛాంబర్ విషెస్..

14
- Advertisement -

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప సంతోషకరమైన వార్త పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి కి రావడం గతంలో అక్కినేని నాగేశ్వరావు గారికి 2011 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది ఆయన వయసు అప్పుడు 67 సంవత్సరాలు అప్పటికి ఆయన దాదాపుగా 150 సినిమాలకు పైగా నటించడం జరిగింది అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని పురస్కారం వరించింది మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి బ్లడ్ సహాయం చేస్తున్నారు. అలాగే కరోనా టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు సి సి సి ద్వారా నిత్యావసర సరుకులు అందించారు ఇండస్ట్రీలో ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే మెగాస్టార్ గారికి ఈ అవార్డు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం.

దీంతో ఈ అవార్డుతో తెలుగు ప్రజలందరూ అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ కి రావడం అనేది చాలా గొప్ప విషయంగా ఇండస్ట్రీ భావిస్తుంది ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వారికి అభినందనలు తెలియజేస్తున్నారు పద్మ విభూషణ అవార్డు అనేది ఏ రంగంలోనైనా అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలా ఈ ఏడాదిగాను తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఈ పురస్కారం వరించింది అయితే పద్మ అవార్డు పొందిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అంటే నగదు ప్రోత్సాహకాలు ఇస్తారా అనేది చాలామందికి ఉన్న సందేహం కానీ పద్మ అవార్డు అనేది ఒక గౌరవ మాత్రమే ఇంత గొప్ప అవార్డు రావడం అనేది తెలుగు ఇండస్ట్రీకే గొప్ప వరంగా భావిస్తూ చిరంజీవి గారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా అభినందనలు తెలియజేసినాము లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురు రాజ్ జేవియర్ చాంబర్ వైస్ చైర్మన్ యాంకర్ మానస ఎడిటర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

- Advertisement -