తెలంగాణ..ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

24
- Advertisement -

అంతా ఊహించినట్లే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఏడు దశల్లో దేశమంతా ఎన్నికలు జరుగగా రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఎన్నికల్లో పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉన్నాయని తేల్చేశాయి. తలపడ్డాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

ఆరా మస్తాన్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు,బీజేపీ 8 నుంచి 9 గెలుస్తుందని తెలిపింది. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదని, హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవేళ్ల, మల్కాజగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ నెలకొందన్నారు.

() ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 6-8
బీజేపీ 8-10
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01
మొత్తం 17

() జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 4-7
బీజేపీ 9-12
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01
మొత్తం 17

 () టీవీ-9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 08 (+)
బీజేపీ 07 (+)
బీఆర్ఎస్ 01 (-)
ఎంఐఎం 01
మొత్తం 17

() పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 7-9
బీజేపీ 6-8
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01
మొత్తం 17

() చాణక్య-ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 9-11
బీజేపీ 4-6
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01
మొత్తం 17

- Advertisement -