తీన్మార్ మల్లన్న నోటిదూల…ఉద్యోగులు బిచ్చగాళ్లు,సన్నాసులు..!

213
mallannna
- Advertisement -

వాపును చూసి బలుపు అనుకోవడం అంటే ఇదేనేమో. పేరుకేమో ప్రశ్నించే గొంతుక(అందులో లిమిట్స్‌). తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిన గొంతుక కేవలం సీఎం కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కాదు. షాడో బీజేపీగా పనిచేసే ఈ గొంతుక…తనకు తాను ఎక్కువగా ఉహించుకుంటూ ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది.

సీఎం కేసీఆర్……ము….కడగండి అంటూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కేసీఆర్….ము…. కడిగేందుకు లైన్ కడుతున్నారని నోటిదూలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అంతేగాదు ఉద్యోగులను రారా….పోరా,బిచ్చగాళ్లు,సన్నాసులు అని మాట్లాడి తన పైత్యాన్ని ప్రదర్శించారు.

చివరగా అందరిని అంటలేను అని చెప్పుకొచ్చినా….తిట్టనుపోరా…కొడకా అన్నట్లు తాను నోటిదురుసుతో చెప్పాల్సింది చెప్పేశాడు. దీంతో మల్లన్న తీరుపై ఉద్యోగులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగులకు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ పొలిమేర వరకు ఉరికిస్తామని హెచ్చరిస్తున్నారు. బడుగు,బలహీన వర్గాల తరుపున ప్రశ్నిస్తానని తనకు తాను చెప్పుకునే ఈసోకాల్డ్ జర్నలిస్టు…తాను కించపరిచిన ఉద్యోగులు బడుగు బలహీనవర్గాల వారేనని మరచిపోవడం సరికాదని….మల్లన్నకు తగిన బుద్దిచెబుతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -