భారీ వర్షాలు..ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం

5
- Advertisement -

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల దాటికి హైదరాబాద్, విజయవాడ జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ రూ. కోటి సాయం అందించగా నటుడు విశ్వక్ సేన్‌తో పాటు ఉద్యోగులు ముందుకొచ్చారు.

ఖమ్మం వరద ముంపు బాధితులకు నెల జీతం విరాళంగా అందజేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. వరద బాధితుల కోసం రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు తెలంగాణ ఉద్యోగులు. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ఉద్యోగుల ఒక రోజు వేత‌నం(రూ.100 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి.

ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి నటుడు విశ్వక్ సేన్ రూ.10 లక్షల విరాళం అందించారు. చిన్న సాయమే అయినా వరద బాధితులకు కొంతమేరకైనా ఉపయోగపడుతుందని విశ్వక్‌సేన్ తెలిపారు.

Also Read:భారీ వర్షాలు..ఎన్టీఆర్ సాయం

- Advertisement -