తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరి చూస్తే ఇరు పార్టీల మద్య ఉన్న అంతర్గత బంధం ఇట్టే బయట పడుతుంది. పైపైకి బద్ధ శతృత్వ పార్టీలుగా చిత్రీకరిస్తూనే లోలోపల మాత్రం అంతర్గత ఒప్పందాలతో రాజీకి వస్తున్నాయి. తాజాగా గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఇరు పార్టీల మద్య సమన్వయం మరోసారి బయట పడింది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ఎమ్మెల్సీ స్థానాలకు గాను దాసోజు శ్రవణ్, సత్యనారాయణ వంటివారిని నామినేట్ చేయగా.. వారికి రాజకీయ సంబంధాలు ఉన్నాయనే కారణంతో గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ స్థానాలకు తిరస్కరించారు. కానీ తాజాగా కాంగ్రెస్ సర్కార్ సిఫారస్ చేయడంతో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ క గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టేందుకు గవర్నర్ సిద్దమయ్యారు. ఈ పరిణామాన్ని బట్టి బీజేపీ కాంగ్రెస్ మద్య ఉన్న అంతర్గత దోస్తీ ఇట్టే బయటపడుతోందని కొందరు రాజకీయ వాదులు అభిప్రాయ పడుతున్నారు..
ఇక ఈ రెండు పార్టీల మద్య దోస్తీని రుజువు చేసేలా ఆ మద్య రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విధితమే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ కలిసి నడవాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకున్నా సందర్భాలు చాలా తక్కువే. వీటన్నిటిని తీక్షణంగా గమనిస్తే ఇరు పార్టీల మద్య ఉన్న అంతర్గత పొత్తు తేటతెల్లమౌతుందనేది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మద్య పొత్తు లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ప్రత్యేక్షమౌతుందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇరు పార్టీలు కూడా గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న వేళ కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకున్న ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఈ రెండు పార్టీల ద్వంద్వ వైఖరి పై ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.
Also Read:కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌పీపీ సమావేశం