- Advertisement -
గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పలు యూనివర్సిటీలు కూడా సెలవులు ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఈనెల 13న నిర్వహించనున్న ఈ-సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రోఫెసర్ లింబాద్రి ప్రకటించారు. కాగా 14 నుంచి జరిగే ఎంసెట్ మాత్రం యధాతథంగా జరుగుతుందన్నారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎలాంటి రాకుండా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహించబోయే తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.
- Advertisement -